Songtexte.com Drucklogo

Allasani Vaari Songtext
von Shreya Ghoshal

Allasani Vaari Songtext

అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా

పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్న చిరునవ్వు లేత చిగురాశ
మళ్ళి పూసాయిలే ఇలా


D D D destiny
Lifeయే మారిందని
ఏదో జరిగిందని
It′s got me feeling so heavenly
D D D destiny
Lifeయే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly

హో అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా

నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాలలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగపిలుపులే
సందడి చేసెనా

తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతుల కళల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తియ్యనా
భాషలో ఉన్న లాలన
కుమ్మరిస్తున్న
పొంగిపోతున్న
నిన్ను కలిసేటి వేళలా


కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో
ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగ మారుతున్నదో
సాగరం నదల్లె పారుతున్నదో
సత్యమే ఇదంత నమ్మమన్నదో
ఏమంటున్నదో

మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసెలా హ హ

D D D destiny
Lifeయే మారిందని
ఏదో జరిగిందని
It′s got me feeling so heavenly
D D D destiny (destiny)
Lifeయే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
Destiny... destiny
Destiny... destiny

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Allasani Vaari« gefällt bisher niemandem.