Bangarukonda Songtext
von Chakri
Bangarukonda Songtext
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మేడ

ఈ మహారాజు చిరునవ్వునే నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే నా ధన దాన్యమనిపించెన
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వైనావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ

నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయెనా
నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయెనా
నీకే నీకే సోగాసాభిషేకం నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసే మమేకం మనదోలోకం అనిపించెనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడా కలియుగపు భగవంతుడా

Writer(s): Chakri, Chandrabose Lyrics powered by www.musixmatch.com