Songtexte.com Drucklogo

Baava Chandamaamalu Songtext
von Mani Sharma

Baava Chandamaamalu Songtext

బావా చందమామలు మరదళ్ళు
వీరే ఇంటికి మణి దీపాలు
గుణంలో మేలిమి బంగారు
పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర మీవాళ్ళు
నిజంగా తేలిపోతారు
భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరే భరత లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు
నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
నా రెండు కళ్ళు తమ్ముళ్ళు


ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం
తప్పదమ్మ నీకు కూడా
ఎవ్వరో అతడు ఎక్కడా ఉండటం
చెప్పవయ్య వాడి జాడ
రాజాలా ఉంటాడే
ప్రేమంటే వాడేలే
నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు
పట్టు పట్టి జట్టు చేస్తాం
చక్కని వదినకి సయ్యనే అన్నకి
వీడిపోని బంధమేస్తాం
ఊ అంటే కన్యా రత్నాలే
కానిస్తాం కన్యా దానాలే
వయ్యారి అక్కా చెల్లెళ్ళే
అవుతారు తోడి కోడళ్ళే

ఆనందం (మీ అందం)
సంగీతం (మా సొంతం)
కొంగుతో కొట్టడం పైటనే జార్చటం
నచ్చినట్టు గుర్తులే లే
గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం
తీయనైన ప్రేమ తీరే
ఆ ప్రేమే స్వీకారం
నీకే నా సహకారం
అక్కలే ఆకులై బావలే వక్కలై
పక్క పక్క చేరుకోండి
ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ
ఒక్కటిగ సాగిపోండి
భలేగా చెప్పావ్ బాబయ్య
మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య
హనీ మూన్ వెళ్లండోరయ్యా
చెయ్యండి నన్ను తాతయ్య


భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరే భరత లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు
నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mani Sharma

Fans

»Baava Chandamaamalu« gefällt bisher niemandem.