Songtexte.com Drucklogo

Balamurali Krishna Songtext
von S.P. Balasubrahmanyam & K. S. Chithra

Balamurali Krishna Songtext

మగ మదనిసా సగమదనిసా
ఓహో, హిందోళం బాగుంది
పాడండి పాడండి

బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే

గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే

స్వచ్ఛమైన సంగీతం
ఖచ్చితంగా మా సొంతం
రాగజీవులం నాదబ్రహ్మలం
స్వరం పదం ఇహం పరం కాగా

బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే


తేనెపాట పాడితే మేను పులకరించదా
వీణపాట పాడితే జాణ పరవశించదా
ఈలపాట పాడితే గాలి తాళమేయదా
జావళీలు పాడితే జాము తెల్లవారదా
భూపాలం పాడితే
భూగోళం కూలదా
హిందోళం పాడితే
ఆందోళన కలగదా

కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా

గులకరాళ్లకేమి తెలుసు చిలక పలుకులు
ఈ గార్దభాలకేమి తెలుసు గాంధర్వ గానాలు

బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే

(సాగదామగ సాగదామగ సాగదామగ సాగదామగ స)
షడ్జమంలో పాడితే లోకమంతా ఊగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతువిప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా
శ్రోతలంతా బుద్ధిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా
ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా
పాతాళం పొంగదా


అలవోకగా పాడగా హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా చిరుజల్లే కురవదా
తేటతెలుగు పాటలమ్మ తోటపువ్వులం
మేము సందేహమంటూ లేని సంగీత సోదరులం

బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే

సనిస దానీసా గసనిద మగసా
తారినన్న తారినన్న తారినన్నన
(నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్)
(నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్)
నినిస గాస నిసగా సనిదమసా
తారినన్న తారినన్న తారినన్నన
(నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్)
(నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్)
ససస ససగ సస సాగ ససగ ససాగ
సనిద మగస గమదా
మదనీ దని సాగస నీసని దానిద మగసా

నీసని దనిసా దస నిదనీ
మగ గస సని నిద దమ మగ గస గమ
దమగా నిదమా సనిదమగా

సగాగ సమామ గామగ సగమద మగ
సమామ గదాద మగమదనీ
ససగసా దాని ససమగా సనిస
గగగ ససస నినిని దదద గగసని
మమమ గగగ ససస నినిని మగసని
సమా సగా నిస దనిస
గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ
సామగ సామగ సామగ సామగ
సాగస నీసని దనిసా
సాగస నీసని దానిద మాదమ గమదని సగగా
మాగమా గసగా గా సని దనిసా
సమగస నిగసని దసనిద మగసని
సాగమదామగ సాగమదామగ సాగమదామగ సాగమదామగ
దా మద నీదమ గా మద నీదమ
మాదని సానిద మాదని సానిద
సాగసనీసని సాగసనీసని సాగసనీసని సాగసనీసని
సమా గా సా నీ దా నీ సా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Balamurali Krishna« gefällt bisher niemandem.