Songtexte.com Drucklogo

Antha Siddanga Songtext
von Shreya Ghoshal & Sonu Nigam

Antha Siddanga Songtext

అంతా సిద్ధంగా ఉన్నది
మనసేంటో సంతోషమన్నది
ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
అల్లాడిపోదా చిన్నది చాల్లే అల్లరి
కథలో తదుపరి
పిలిచే పద మరి
మనువే కుదిరి
మురిపెం ముదిరీ
మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి

అంతా సిద్ధంగా ఉన్నది
హద్దు మీరేట్టుగానే ఉన్నది
ఆలస్యమెందుకన్నది
సరేలే మరి


పైట పడి ఎదిగిన వయసా
ఓయ్ ఏంటి కొత్త వరస
బయటపడకూడదు సొగసా
పోవోయ్ చాల్లే నస
పైట పడి ఎదిగిన వయసా
బయటపడకూడదు సొగసా తెలుసా
మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు నిన్నంతలాగ చూస్తే అలా

ఎందుకంత కుళ్లు
నువ్వైనా ఇన్నాళ్ళు నన్ను కొరకలేదా అచ్చం అలా
కనుకే కలిశా బంధమై బిగిశా
నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి

చెంపలకు చెప్పవే సరిగా
సిగ్గూపడమని ఒక సలహా
చెంపలకు చెప్పవే సరిగా
సిగ్గూపడమని ఒక సలహా
చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక పసిపాపలాగ ఉంటే అలా
ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చటంతా కంగారు పెట్టకపుడే ఇలా
ఉరికే సరదా చెబితే వింటదా
నీకు ఇష్టమైనా కష్టమైనా ఒప్పుకోదు అది

అంతా సుఖంగా ఉన్నది
మనసేంటో సంతోషమన్నది
ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి
ఇలా రా మరి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Antha Siddanga« gefällt bisher niemandem.