Songtexte.com Drucklogo

Vennelo Godari Andam Songtext
von S. Janaki

Vennelo Godari Andam Songtext

అ అ అ అ అ

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌనగీతం
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం

జీవిత వాహిని అలలై ఆ ఆ ఆ ఆ ఆ
జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై
బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో
ఎడబాటే ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం


నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి
ఆ ఆ ఆ ఆ
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే

నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే

మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో
తిరిగే సుడులై
ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. Janaki

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Vennelo Godari Andam« gefällt bisher niemandem.