Konthakalam Kindata Songtext
von R. P. Patnaik
Konthakalam Kindata Songtext
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపుకాసే జంటరెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేనూ నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
బొమ్మాబొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్థం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదలై సాగాలి ఈ స్నేహం

Writer(s): Sirivennela Seetha Rama Shastry, Rabindra Prasad Pattnaik Lyrics powered by www.musixmatch.com