Songtexte.com Drucklogo

Mogindhi Jai Ganta Songtext
von Mani Sharma

Mogindhi Jai Ganta Songtext

తననాన నానాన
తననాన నానాన
మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట

కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా
నను పిలిచినది పూబాట
తనతోపాటే వెళ్ళిపోతా

ఆకాశం నీడంతా నాదేనంటోంది,
అలలు ఎగసే ఆశ

ఏ చింత కాసింత లేనే లేదంది,
కలత మరిచే శ్వాస

మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

పదపదమని నది నడకని ఇటు నడిపినదెవరైనా,
తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా


ప్రతి పిలుపునీ కథ మలుపని మలి అడుగులు వేస్తున్నా,
అలుపెరుగని పసి మనసునై సమయంతో వెళుతున్నా

నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపున

ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించని పయనంలోన,
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా

మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

ఒక చలువగా ఒక విలువగా జత కలిసినదో సాయం,
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం

కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం,
అది మొదలుగా నను ముసిరినా ఏకాంతం మటుమాయం

నా చుట్టూ అందంగా మారింది లోకం,
ఊహల్లోనైనా లేదీ నిజం

చిరునవ్వుతో ఈ పరిచయం వరమై ఇలా నను చేరేనా,
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా


మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
ఓ మనసంటోంది ఈ మాట

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mani Sharma

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Mogindhi Jai Ganta« gefällt bisher niemandem.