Songtexte.com Drucklogo

Padaharu Kalalaku Songtext
von M. M. Keeravani

Padaharu Kalalaku Songtext

ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్ వేంకట నాయకస్య
నిత్య షోడశోపచార పూజాం కరిష్యే
ఆవాహయామి
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం

ఓం ఆసనం సమర్పయామి
పరువాల హొయలకు పైయెదలైన
నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం

ఓం స్నానం సమర్పయామి
చిత్తడి చిరుచెమటల చిందులు చిలికే
పద్మినీ భామినులకు పన్నీటి స్నానం


ఓం గంధం సమర్పయామి
ఘలంఘలల నడల వలన అలసిన
మీ గగన జఘన సొబగులకు శీతల గంధం

ఓం నైవేద్యం సమర్పయామి
రతివేద వేద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం

ఓం తాంబూలం సమర్పయామి
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు
ఈ కొసరు కొసరు తాంబూలం

ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
అనంగరంగ భంగినులకు
సర్వాంగ చుంబనాల వందనం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von M. M. Keeravani

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Padaharu Kalalaku« gefällt bisher niemandem.