Songtexte.com Drucklogo

Kothaga Songtext
von Devi Sri Prasad

Kothaga Songtext

(ఓం
ఓం)

(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)

ఓంకారనాదంతొ అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం (ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
హ్రీంకార నాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం (ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
యుగయుగాలుగ గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా కదలివచ్చిన చరిత ఈ ఖడ్గం

తనకళ్లముందెన్నిసామ్రాజ్య శఖరాలు మన్నుపాలైనా
క్షణమై తనగాధ గతములో విడిచి మృతిఒడి చేరనిదీ ఖడ్గం
పూటకో పడమరను దాటి పూర్వద్రిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం
(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహ్ద్భుతం ఉన్నది ఈ ఖడ్గం
(కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహ్ద్భుతం ఉన్నది ఈ ఖడ్గం)
మూడువన్నెల కేతనముగా మింటికి ఎగసి
కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం


(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)

హరిని ధరపై అవతరించిగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరులోని దైవాంశమే అర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షకై ధరించిన ధీరగుణమీఖడ్గం (ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
ధూర్త శిక్షణకై వహించిన కరుకుతనమీ ఖడ్గం (ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
హుంకరించి అహంకరించి అతిక్రమించిన ఆకతాయుల
అంతుచూసిన క్షాత్రస్తత్వం
అస్తమించని అర్క ఖడ్గం
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్నిజాతుల
పొదువుకున్న ఉదారతత్వం (ఖడ్గం ఖడ్గం)
జగపతిమరువని ధర్మఖడ్గం (ఖడ్గం ఖడ్గం)

నిద్దురమత్తును వదిలించే కెంజాయుల జిలుగీ ఖడ్గం
(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)
మట్టిని చీల్చుకు చిగురించే సిరిపచ్చని చిగురీ ఖడ్గం
(ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)


(కెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Quiz
Wer singt das Lied „Haus am See“?

Fans

»Kothaga« gefällt bisher niemandem.