Songtexte.com Drucklogo

Neekem Kaavaalo Cheppu Songtext
von Benny Dayal & Mahathi

Neekem Kaavaalo Cheppu Songtext

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు


కలలే చెరగవని కలతే వలదు అని
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి
ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నదిలేను
అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే

తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా

ఋతువులు మారిపోగా కాలమిట్టే దొర్లిపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే
రాసే నీ వేళ్ళు చూసి
నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితలెన్నో గురుతుకొచ్చెనులే
ధృవముల నడుమ సాగె దూరమానాడు
భుజమున నీ శ్వాస ఊగెను నేడు


తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Neekem Kaavaalo Cheppu« gefällt bisher niemandem.