Songtexte.com Drucklogo

Mana Bharatham Lo Songtext
von S. P. Balasubrahmanyam

Mana Bharatham Lo Songtext

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాధే ఈ రాజు పాట
నా పేరే రాజు
ஏன் பெயர் டான் రాజు
मेरा नाम రాజు
My name is రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా

भाइयों और बेहनो
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు


విజయుడై వచ్చినాడురా
తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా
ఆ స్వర్గమునే దించినాడురా
అక్షతలే చల్లినారు రమణులంతా
అహా హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా

(ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాట)

రాజాధి రాజా మార్తాండ తేజ
నాపేరే రాజు
My name is రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాధే ఈ రాజు పాట
నాపేరే రాజు
ஏன் பெயர் டான் రాజు
मेरा नाम రాజు
My name is రాజు, రాజు, రాజు

అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి

(తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం)

చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట


(పగ పద సాస సరి గరి సాపద
పగ పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస)

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా

(నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట)

రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు
मेरा नाम రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట
मम नाम రాజు
ஏன் பெயர் டான் రాజు
വേണ്ട പേരെ రాజు
ನನ್ನ ಹೆಸರೇ రాజు
నా పేరే రాజు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Mana Bharatham Lo« gefällt bisher niemandem.