Songtexte.com Drucklogo

Yellipoke Shyamala Songtext
von Karthik

Yellipoke Shyamala Songtext

నువ్వు పక్కనుంటే బాగుంటాదే
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తిపెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్టవచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకే శ్యామలా
ఎళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకే శ్యామలా

ఎక్కి ఎక్కి ఏడవలేనే, ఎదవ మగపుటక
గుండె పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకే శ్యామలా
హే′ ఎళ్ళమాకే శ్యామలా
నువ్వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకే శ్యామలా


నరంలేని నాలిక నిన్ను ఎళిపొమ్మని పంపిందాయే
రథంలేని గుర్రంలాగా బతుకే చతికిలబడిపోయే
నీ poster అడ్డంగా చింపేశాననుకున్నా
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే

Switch ఏస్తే ఎలిగేదా, ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమే ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసి పట్టేసి నీతో పట్టుకుపోమాకే
గెలిచేసి నన్నొదిలేసి సీకటైన కోటలాగ సెయ్యమాకే
నువ్వెళ్ళిపోకే శ్యామలా
నువ్వు ఎళ్ళమాకే శ్యామలా
ఏమీ బాగాలేదే లోపల
నువ్వు ఎళ్ళిపోకే ఎళ్ళిపోకే ఎళ్ళిపోకే శ్యామలా

మనసుకంటుకున్నదో మల్లెపూల scent మరక
మరిచిపోదమంటే గుర్తుకొస్త ఉందా నిప్పుసురక
ఏటి సెయ్యనోరి సైదులు
గుండెలోన గుచ్చిపోయినాది సూదులు
నానేటి సెయ్యనోరి సైదులు
గుండెలోన గుచ్చిపోయినాది సూదులు
ఎళ్ళిపోకే శ్యామలా
అట్ట ఎళ్ళమాకే శ్యామలా
నువ్వు ఎళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Karthik

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Yellipoke Shyamala« gefällt bisher niemandem.