Songtexte.com Drucklogo

Saripovu Songtext
von Haricharan

Saripovu Songtext

సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎదలైనా
నిను దర్శించి దరి చేరి వలచేందుకు
సరిపోవు భాషలెన్నయినా
సరిపోవు మాటలెన్నయినా
నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు
చాలదుగా ఎంతైనా సమయం
ఆగదుగా నీతో ఈ పయనం
కళ్లనే చేరి గుండెలో దూరి
శ్వాసలా మారినావే
స్వాతీ చినుకై నాలో
దూకావే ఏకంగా
స్వాతీ ముత్యంలాగా
మారావే చిత్రంగా

స్వాతీ చినుకై నాలో
దూకావే ఏకంగా
స్వాతీ ముత్యంలాగా
మారావే చిత్రంగా


సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎదలైనా
నిను దర్శించి దరి చేరి వలచేందుకు

ఏంటా నవ్వడం చూడడం గుండెనే కోయడం
దూరమే పెంచడం ఎందుకో ఈ యెడం
మనసుకు తెలిసిన మాట
పలకదు పెదవుల జంట
ఎదురుగ నువు రాగానే నాకేదో ఔతోందట
కనుల ముందు నువు నించున్నా
నే కళ్లు మూసి కలగంటున్నా
అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో వున్నా

స్వాతీ జల్లయ్ నన్నే
ముంచావే మొత్తంగా
స్వాతీ కిరణం నువ్వయ్
తాకావే వెచ్చంగా

స్వాతీ జల్లయ్ నన్నే
ముంచావే మొత్తంగా
స్వాతీ కిరణం నువ్వయ్
తాకావే వెచ్చంగా

సరిపోవు కోటి కనులైనా
సరిపోవు లక్ష ఎదలైనా
నిను దర్శించి దరి చేరి వలచేందుకు


నింగే పిడుగులే వదిలినా పువ్వులై తడిమెనా
ఉరుములే పంచినా స్వరములై తోచెనా
తలవని అపశకునాలే
శుభ తరుణములుగ తేలె
వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే
ఎన్ని ఆపదలు వొస్తున్నా
అవి నన్ను ఆదుకొని కాచేనా
కలిసి వచ్చే వింతలన్నీ కచ్చితంగా నీ మహిమేనా

(నిను దర్శించి దరి చేరి వలచేందుకు)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Haricharan

Quiz
Wer ist kein deutscher Rapper?

Fans

»Saripovu« gefällt bisher niemandem.