Songtexte.com Drucklogo

Ammananna Songtext
von Ghantasala

Ammananna Songtext

అమ్మా నాన్నా
అమ్మా అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
పదినెలలు నను మెసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ
తలచకమ్మా తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా


దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళుకడుగుతా నాన్నా నాన్నానాన్నా
మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
మీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా
మాతాపిత పాదసేవ మాధవసేవేయని మరువనమ్మ
మాతాపిత పాదసేవ మాధవసేవేయని మరువనమ్మ
నన్ను మన్నించగరారమ్మా అమ్మా అమ్మా

అమ్మా అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
అమ్మా అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
అమ్మా ఆలకించవేమమ్మా అమ్మా అమ్మా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ghantasala

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Ammananna« gefällt bisher niemandem.