Songtexte.com Drucklogo

Ninnu Chudagane Songtext
von Devi Sri Prasad

Ninnu Chudagane Songtext

నిన్ను చూడగానె చిట్టిగుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్

Oh yeah
Ah Ah
ఏహ్′ అవతలకి పో, Oh yeah

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

Once More with Feeling
Oh No


ఏ' అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే
ఏయ్′ భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే
ఏయ్' అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె - చీమలా నేను వెంట పడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె - కాపలాకి నేను వెంట రానా
కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై

ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం
మ్మ్' అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆ హుం ఆ హుం
హోయ్′ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాల మీద మీగడేదమ్మా
హా′ వేడి పాలలోన వెన్న ఏదమ్మా
ఆ హుం ఆ హుం

Please dance yaar

మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాలసీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగల్ను
తెలుగు భాషలో నాకు తెల్సిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా
నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Quiz
Whitney Houston sang „I Will Always Love ...“?

Fans

»Ninnu Chudagane« gefällt bisher niemandem.