Songtexte.com Drucklogo

Baby He Loves You Songtext
von Devi Sri Prasad

Baby He Loves You Songtext

ఛ... వాడికి నా మీద ప్రేమే లేదు he doesn′t love me you know?
No, he loves you. He loves you so much
అవునా ఎంత?
ఊ... ఎంతంటే ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత
ఓ... ఇంకా...

హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్ళి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
Baby he loves you, he loves you, loves you so much
Baby he loves you, he loves you, loves you so much

హే అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
Baby he loves you, he loves you, loves you so much
Baby he loves you, he loves you, loves you so much

హాయ్ పంటచేలలోని జీవమంత, ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత, ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత, రామలాలి అంత
Baby he loves you, he loves you, loves you so much
Baby he loves you, he loves you, loves you so much

పచ్చి వేప పుల్ల చేదు అంత, రచ్చబండ పైన వాదనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
(Baby he loves you, he loves you, loves you so much)
(Baby he loves you, he loves you, loves you so much)

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
Baby he loves you, he loves you, loves you so much
Baby baby he loves you, loves you, loves you too much
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత
Baby he loves you, he loves you, loves you so much
Baby he loves you, he loves you, I love you so much

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»Baby He Loves You« gefällt bisher niemandem.