Songtexte.com Drucklogo

Thammudu Are Thammudu Songtext
von Chiranjeevi

Thammudu Are Thammudu Songtext

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కద నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి lecture ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ love లో మీరు మెగాస్టారు
Thank you... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
(మీరింత బాగా పాడగలరని మేమస్సలనుకోలేదు master)
(ఇంతవరకూ నేనెప్పుడూ పాడలేదోయ్ ఇదే first time)
(సార్ మొదటిసారి మీరదరగొట్టేసార్ సార్)
(మీ ఉత్సాహం చూసి ఎదో సరదాగా hum చెయ్యాలనిపించింది చేసానంతే)
(Master ఈ పాటకు మంచి step కలిసిందంటే అదురుతుంది)
(డాన్సేగా చాలా బావుంటుంది చెయ్యండి)
(మేము కాదు master మీరు)
(నేను డాన్సా? No no no)
(Please sir please)
(Okay okay)

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ language తెలియనిదెవరూ
మూగ సైగలైన చాలు, వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో English ప్రేమ
ఆఫ్రికాలో jungle ప్రేమ


ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్ళు, పొట్టవాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్ళగానే మానవులుగా మిగులుతారు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కద నా మాటింటే

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్గా సాగుతున్న మహా నవలరా ప్యారు
ఆ story కొట్టదు బోరు
క గుణింతం తెలియని వాళ్ళు కాళిదాసులు అయిపోతారు

కాఫీ టీలే తాగని వాళ్ళు దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు
లబ్బుడబ్బు heart beat లవ్వు లవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కద నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి lecture ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ love లో మీరు మెగాస్టారు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Thammudu Are Thammudu« gefällt bisher niemandem.