Songtexte.com Drucklogo

Plichina Songtext
von Chakri

Plichina Songtext

పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ
అందని వరమే ప్రేమ, మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం, ప్రేమే పదిలం
ఏమీ కాదు క్షణికం, అన్నీ తానే ప్రణయం
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా
పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ

వలపును చినుకుగ భావించా అది నా తప్పుకదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా
ఎన్నేళ్ళో ఎదురీత, ఎన్నాళ్ళీ ఎద కోత
ప్రేమే ఆట కాదు, గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే, తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ... ప్రేమ ప్రేమ ప్రేమ
పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ

మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా
ఆపాలి ఏదోలా, చెబుతావా ప్రియురాలా
నీడై నీతో పాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగీ నేల కలవవని, నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ... ప్రేమ ప్రేమ ప్రేమ
ఆపిన ఆగదు ప్రేమ, దాచిన దాగదు ప్రేమ
మనసును కలుపును ప్రేమ
మహిమలు చూపును ప్రేమ
ప్రేమే గగనం, ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం, ప్రేమించాలి హృదయం
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా
I love you love you రా I love you love you రా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Chakri

Fans

»Plichina« gefällt bisher niemandem.