Songtexte.com Drucklogo

Ooru Palleturu Songtext
von Bheems Ceciroleo

Ooru Palleturu Songtext

ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఎప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావా ఏంటీ
నీ పాసుగాల


కోలో నా పల్లె కోడి కూతల్లే
పొద్దిరుసుకుందే కోడె లాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ రామ
తలకు పోసుకుందే నా నేల తల్లే
అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే
హే తెల్లా తెల్లాని పాలధారలల్ల
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోన
జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సిల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల సప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల
ఆ ఊరు పల్లెటూరు దీని తీరే
అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే
ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు
ఆ వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే


ఆలు మగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మగని
తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
ఒచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది
ఊరు నా ఊరు దీని తీరే
అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే
ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు దీని తీరే
కన్న కూతురు
కండ్ల ముందే ఎదుగుతున్నా
సంబరాల పంటపైరు
ఆ వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Ähnliche Artists

Fans

»Ooru Palleturu« gefällt bisher niemandem.