Songtexte.com Drucklogo

Manasu Maree Songtext
von Amit Trivedi

Manasu Maree Songtext

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల


హో′ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
హా' బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూలనావ గాలితోవ హైలోహైలెసో
హో′ చేరనీవా చేయనీవా సేవలేవేవో
ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల

మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరోజన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
హో′ నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
హో′ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Amit Trivedi

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Manasu Maree« gefällt bisher niemandem.