Songtexte.com Drucklogo

Gundello Emundho Songtext
von Venu & Sumangali

Gundello Emundho Songtext

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
మనసా (మనసా) మనసా (మనసా)
మనసా (మనసా) హో మనసా!


పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పైనించి... వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ... ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించి... పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించి... పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది


మనసా (మనసా) మనసా (మనసా)
మనసా (మనసా) హో మనసా!

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Gundello Emundho« gefällt bisher niemandem.