Songtexte.com Drucklogo

Vyshnavi Bhargavi Songtext
von Vani Jairam

Vyshnavi Bhargavi Songtext

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే
సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే


ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము
సంచిత సంకేతము
ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము
సంచిత సంకేతము
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము
సుకృత సంపాకము
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము
సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకిని
మాంపాహి సుజ్ఞాన సంవర్ధిని
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే

ఆలోచనామృతము సాహిత్యము సహిత హితసత్యము శారదాస్థన్యము
ఆలోచనామృతము సాహిత్యము సహిత హితసత్యము శారదాస్థన్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిణి సారసలోచని వాణి పుస్తకధారిణి
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి
మాంపాహి సాలోక్యసంధాయిని
మాంపాహి శ్రీచక్ర సింహాసిని
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే
సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Vani Jairam

Ähnliche Artists

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Vyshnavi Bhargavi« gefällt bisher niemandem.