Songtexte.com Drucklogo

Anathineeyara Songtext
von Vani Jairam

Anathineeyara Songtext

ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా
పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా
జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా
సానిప గమపా నిపమ
గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస
సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ
సగగాస సాససని సాగగ
గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా
శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని
విషపునాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలియే
వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ
కింకరునిక సేవించుకొందురా ఆనతినీయరా
పప పమప నినిపమ గస గగ
పప పమప నినిపమ గస గగ
గమపనిగ మపనిసమ పనిసగ నీస పాని మాప గామ సాగమ
పప పమప నినిపమ గస గగ

గమపనిగా మపనిసమా పనిసగ నీస పాని మాప గామ సగమప
పప పమప నినిపమ గస గగ


గమపని గమపని స మపనిస గని
గమపని గమపనిస మపనిస గని స పని మప గమ సగమ
పప పమప నినిపమ గస గగ

గామాపని గమాపానిస మపాని సగనిస పనిమప గమ సాగామ
పప పమప నినిపమ గస గగగ

గగ మమ పపనిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పప నిని ససగని తక తకిట తకధిమి
పపని మపగమ సగమ పప పమప నినిపమ గస గగ

రక్షాద్వరశిక్షా దీక్షాదక్షా విరూపాక్షా
నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక
రక్ష రక్షయను ప్రార్థన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Vani Jairam

Ähnliche Artists

Fans

»Anathineeyara« gefällt bisher niemandem.