Songtexte.com Drucklogo

Balegaa Vundhi (From “Stuvartupuram Police Station”) Songtext
von S.P. Balasubrahmanyam & K. S. Chithra

Balegaa Vundhi (From “Stuvartupuram Police Station”) Songtext

భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా చెడింది నిద్దర
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయె
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయె

కథేమిటే చెలీ ఇదేమి కౌగిలి
గులాబి మొగ్గలో గులేబకావళి
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా


పిచ్చి ఎక్కి గాలి గిచ్చి చంపుతుంటే
ఎక్కడో చిక్కడే సిగ్గు పాప
గుచ్చి గుచ్చి చూసే కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
వయ్యారి ఒంటికీ ఒత్తిడంత ఇష్టమా
ఆ కంటి చాటుకే రాలేవా
శృంగార లీలకీ చీకటెంత ఇష్టమా
ఆ పొద్దు వాలితే వారేవ్వా
అందాల ఆరడి అయ్యాక నే ready
అందాక తాకిడి ఆపైన దోపిడి
పాదాలు నేను దాచుకుంటా
ప్రాయాలు నేను దోచుకుంటా
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా...

ముక్కు మీద కోపం ముట్టుకోని రూపం
ఇక్కడే ఇప్పుడే అంటుకోనా
పక్కదిండు పాపం చుట్టాలమ్మ సాక్ష్యం
వద్దనీ వాయిదా వేసుకోనా
అమ్మాయి తీగరో సన్నాయి నొక్కుతో
సంగీత నవ్వులే రావాలి
అబ్బాయి రాకతో లల్లాయి పాటలో
గారాల ఎంకినై పోవాలి
శ్రీకాముడీ గుడి సిందూర పాపిడి
పట్టిందిలే రతి ప్రాయాల హారతి
గుప్పిళ్ళు విప్పుకోని పాప
చప్పుల్లు చాలుగాని టాటా
కథేమిటే చెలీ ఇదేమి కౌగిలి
గులాబి మొగ్గలో గులేబకావళి
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయె
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Balegaa Vundhi (From “Stuvartupuram Police Station”)« gefällt bisher niemandem.