Songtexte.com Drucklogo

Mooga Manasulu Songtext
von Shreya Ghoshal & Anurag Kulkarni

Mooga Manasulu Songtext

మూగమనసులు
మూగమనసులు

మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలిరావటే చైత్రమా
కుహూ కుహూ కుహూ
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ

మూగమనసులు
మూగమనసులు


ఊహల రూపమా, ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమా, పూల పరాగమా
నా గతజన్మల ఋణమా

ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవనీ
ఈ కథే నిజమని కలలలోనే గడపనీ
వేరేలోకం చేరే వేగం పెంచే మైకం
మననిలా తరమనీ
తారాతీరం తాకే దూరం ఎంతో ఏమో
అడగకేం ఎవరినీ

మూగమనసులు
మూగమనసులు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Mooga Manasulu« gefällt bisher niemandem.