Songtexte.com Drucklogo

O Kalala Kathala Songtext
von Sathyaprakash & Chinmayi

O Kalala Kathala Songtext

ఓ కలలా కథలా కలిసే
దూరాలే తీరాలై
ఓ జతగా జగమై కదిలే
పాదాలే ప్రాణాలై


ఇది విధియే విధిగా కలిపే
ఊహించని మలుపై
ఇరు దిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలో
ఈ క్షణమే మనకే దొరికే
సంతోషం మనదై
కడవరకూ మనతో నడిచే
ఈ దారిలో
రా రా రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా రా దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా రా కోరుకొనే కొత్త జగం చేరుకునే
ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం
గడిచిన కాలం గాయం ఏదో చేసినా
మనస్సుపై మందే పూసే మంత్రమున్నదే
నిరంతరం నీడలాగా ఉంటున్నది తానేగా
ఉషస్సులో ఊపిరి పంచే గాలిపాటలా
ఒక చినుకేదో తాకి చిగురేస్తుంటే చైత్రం
తడి కన్నుల్లో విరిసే చిరునవ్వే నీ సొంతం
విడిపోలేవు గంధాలు ఆ పూలనుండే
అవి కనరాని బంధాలులే
(దారిలో దారిలో దారిలో)

రా రా రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా రా దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా రా కోరుకునే కొత్త జగం చేరుకునే
ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం

(దిత్తిత్తార దిత్తైతై తోం)
(దిత్తిత్తార దిత్తైతై తకతోం తకతోం)
(அம்பரசீமா கண்டு வரவே) (దిత్తిత్తార దిత్తైతై తోం)
(அம்பரசீமா கண்டு வரவே) (దిత్తిత్తార దిత్తైతై తోం)
(ஒரு மதுரா நினட மருளிடவு) (దిత్తిత్తార దిత్తైతై తోం)
(அம்புஜ நேத்ர சந்திர வதனே) (దిత్తిత్తార దిత్తైతై తోం)
(கத மொற்காடினி) (దిత్తిత్తార దిత్తైతై తోం)

మనసుకు నేడే మళ్ళీ ఇంకో జన్మలా
ఎడారిలో పూలై పూసే వాన జల్లులా
వసంతమై ఈ ప్రవాహం వర్ణాలతో సావాసం
ప్రతిక్షణం పచ్చగా నవ్వే కొత్త జీవితం
పడి లేచేటి పాదాలు పారాడుతుంటే
నడిపిస్తుంది ఈ కాలమే


రా రా రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా రా దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా రా కోరుకొనే కొత్త జగం చేరుకునే
ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం

ఓ కలలా కథలా కలిసే
దూరాలే తీరాలై
ఓ జతగా జగమై కదిలే
పాదాలే ప్రాణాలై
ఇది విధియే విధిగా కలిపే
ఊహించని మలుపై
ఇరు దిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలో
ఈ క్షణమే మనకే దొరికే
సంతోషం మనదై
కడవరకూ మనతో నడిచే
ఈ దారిలో

రా రా రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా
రా రా దిక్కులనే చుక్కలనే దాటి అలా
రా రా కోరుకొనే కొత్తజగం చేరుకునే
ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»O Kalala Kathala« gefällt bisher niemandem.