Songtexte.com Drucklogo

O Priyathama Songtext
von S. P. Balasubrahmanyam

O Priyathama Songtext

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా


నింగివీణకేమొ నేలపాటలొచ్చె తెలుగుజిలుగు అన్నీ తెలిసి
పారిజాత పువ్వు పచ్చిమల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకకన్నా నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే
మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా


ప్రాణవాయువేదో వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంతా ఎంకి పాటలాయె మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయె బహుశా మనసా వాచా వలచి
మేనకల్లె వచ్చి జానకల్లె మారె కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా
ప్రియతమా
ప్రియతమా
ప్రియతమా
నను పలకరించు ప్రణయమా
అతిథిలా
నను చేరుకున్న హృదయమా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»O Priyathama« gefällt bisher niemandem.