Songtexte.com Drucklogo

Andhari Bhanduvayya Songtext
von S. P. Balasubrahmanyam

Andhari Bhanduvayya Songtext

రామా... రామా

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

రామా... రామా

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా


మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం

పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Andhari Bhanduvayya« gefällt bisher niemandem.