Songtexte.com Drucklogo

Abhinavatharavo Songtext
von S. P. Balasubrahmanyam

Abhinavatharavo Songtext

అభినవ తారవో
నా అభిమాన తారవో
అభినవ తారవో
అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర సింజాల సుమశర శింజిని
శివరంజనీ
శివరంజనీ

అది దరహాసమా మరి మధుమాసమా
అది దరహాసమా మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన కవకాశమా

అవి చరణమ్ములా? శశికిరణమ్ములా?
అవి చరణమ్ములా? శశికిరణమ్ములా?
నా తరుణ భావనా హరినమ్ములా
అభినవ తారవో
నా అభిమాన తారవో
అభినవ తారవో
శివరంజనీ
శివరంజనీ


ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు

ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆమెన్నడుము ఆడిన చాలు

ఆమెన్నడుము ఆడిన చాలు
రవళించును పదకవితా ప్రభందాలు
అభినవ తారవో
నా అభిమాన తారవో
అభినవ తారవో
శివరంజనీ
శివరంజనీ

నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా

నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా

వీరమా నీ కుపిత నేత్ర సంచారమే

హాస్యమా నీకది చిటికలోన వశ్యమే

నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ
మిన్నులందుకున్నవాడ


నీ ఆరాధకుడను
ఆస్వాదకుడను
అనురక్తడనూ
నీ ప్రియభక్తుడనూ

అభినవ తారవో
నా అభిమాన తారవో
అభినవ తారవో
శివరంజనీ
శివరంజనీ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Abhinavatharavo« gefällt bisher niemandem.