Songtexte.com Drucklogo

Sari Sari Hari Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela

Sari Sari Hari Songtext

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ

అక్షర సుమాలు నావై
స్వర లక్షణ సూత్రము నీవై
సరిగమపదనిస సనిదపమగరిస
సప్తవర్ణముల గాన లహరిలో ఇంధ్రధనుసుగా నా సొగసు
ఇలకు చేరగా నీ కొరకు
సరిగమపదనిస సా సా
సరిగమపదనిస సా సా
దనిసనిసరిదప సనిదప మగరిస
దనిసనిసరిదప సనిదప మగరిస

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ


సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ

సరిసరి నటనల అందియనై
సరసానికి వ్రేపల్లియనై
వేణు వీధిలో వేసవి గాలిని నేనై
విరహిణినై స్వరధునినై రసనదినై
పొంగిపొరలి నే వస్తున్నా
నింగినేల ముడి వేస్తున్నా
సరిగమ సమగరి సరిగమపదనిస
సరిగమ సమగరి సరిగమపదనిస
సనిదప సపదని సనిదపమగరిస
సనిదప సపదని సనిదపమగరిస

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ


పులిలా చూడకు ప్రియా
భీతహరిణి నేత్రిని నేను
పులిలా చూడకు సఖా
ప్రాణ శిల్ప ధాత్రిని నేను
ప్రియా ఆఆఅ సఖా ఆఆఆ
చలిగా చూస్తే నెచ్చెలిని
చెలిగా నీలో సగమవుతాను
చెలిమై నీకూ సఖినౌతానూ
సపమపగమరిగ సపమపగమరిగ
సరిగమపదనిస సరిగమపదనిస
పసనిసదనిమద పసనిసదనిమద
సనిదపమగరిస సనిదపమగరిస

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ

సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ

సనజాజి వానల్లో సంపంగి వరదల్లో
తేనెలో తడిసాను తీపిలో మునిగాను
నీ చూపు వేడిలో తడి ఆర్చుకున్నాను
నచ్చింది మనువు పిల్లకీ భల్ అందగాడా
నచ్చింది మల్లెల పల్లకీ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & P. Susheela

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Sari Sari Hari« gefällt bisher niemandem.