Songtexte.com Drucklogo

Chiluka Ye Thodu Leka Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Chiluka Ye Thodu Leka Songtext

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక


(గోరింక ఏదే చిలక లేదింక)
(గోరింక ఏదే చిలక లేదింక)
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

(కొండంత అండే నీకు లేదింక)
(కొండంత అండే నీకు లేదింక)
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Fans

»Chiluka Ye Thodu Leka« gefällt bisher niemandem.