Songtexte.com Drucklogo

Abjivandanam Yama Rajagrani Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Abjivandanam Yama Rajagrani Songtext

ధర్మపరిరక్షణా ధురంధరుండ
సకలపాప శిక్షణా దక్షుండ
చండతర దండథర బాహుమండిత విగ్రహుండ
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ యముండ.

అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ... ఆ... ఆ... ఆ...
ఏమీ శభాష్...
సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ.


సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్... ఆ... ఆ...
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం.ఆ.ఆ.ఆ

ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస...
రసికాగ్రేసరుండ యముండ
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రా దేవరా

మజ్జారే మదవతీ
సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ.

ధర్మపరిరక్షణా ధురంధరుండ

సకలపాప శిక్షణా దక్షుండ

చండతర దండథర బాహుమండిత విగ్రహుండ

నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ... యముండ.

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Abjivandanam Yama Rajagrani« gefällt bisher niemandem.