Songtexte.com Drucklogo

Maha Kanaka Durga Songtext
von S. Janaki

Maha Kanaka Durga Songtext

మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టుంచు ఆధిశక్తి
మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను


విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమనే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ, కరుణ, వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి

లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం
దుర్గమ్మ నీ దర్శనం
మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ
పరాశక్తి లలితా శివానంద చరితా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. Janaki

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Maha Kanaka Durga« gefällt bisher niemandem.