Songtexte.com Drucklogo

Neetho Unte Chalu Songtext
von Ramya Behara

Neetho Unte Chalu Songtext

నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు
అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు
నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు
కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు

నువ్వేవైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు
వచ్చేజన్మలెన్నైనా నీతో ఉంటే చాలు
పీల్చేగాలి లేకున్నా నీతో ఉంటే చాలు
నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు

నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు
అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు


పడిపడిపడి త్వరపడిరానా నువ్వే మారుమూలనున్నా
విడిపడి నిన్ను వదిలెళతానా నువ్వే పొమ్మన్నా
ఓ క్షణం దూరమై ఉంటే తీరని యాతన
తక్షణం నీ జతైపోతే నా పంచప్రాణాల్లో ఆనంద సంకీర్తన

నీతో ఉంటే చాలు
నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు
అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు

గిరగిరగిర తిరిగే లోకం ఏటోవైపు పోతేపోనీ
తలమునకల పరవశమై నే నిన్నే చూడనీ
ఆకలి దాహము ఏదీ చెంతకే చేరదే
రంగులే మారినా తేది నీ ధ్యాసలో ఉన్న నా కన్ను గుర్తించదే

నీతో ఉంటే చాలు
నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు
అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Neetho Unte Chalu« gefällt bisher niemandem.