Songtexte.com Drucklogo

Ye Kavithalano Songtext
von Pradeep Kumar

Ye Kavithalano Songtext

ఏ కవితలనో తెలిపినవి కనులు ఇవే
నా ఎదసడిలో శ్రుతిగతిని మార్చినవే
ఊహించుకున్నా జన్మాలు వేలు, నీతో క్షణమే చాలు
కదలాడెనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా
లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా

కనిపించే తీరం తరిగేనా దూరం
దరిచేరే సమయం వరమై రానా
అందనిది అందం అందుకనే అందుం
అందరిలో తానే ఎంతో అందం
చెలియా


నీ చిటపటల చూపులతో చురకెందుకో
రా చిగురెదలో చిరులతలా పెనవేసుకో
మరీ చికాకై మరీచికా నువ్వే
మరీ మరీ కోరే మనస్సు నీ నవ్వే
బిడియపు మడి విడువడి ఇక మనసుని తెలిపేసెయ్ వా
కదలాడెనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా
లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా
ఏ కలతలిలా పరిచయమో నా ఎదకు
నీ గతములలో ఒక స్మృతిగా
ఊహించి నీతో జన్మాలు వేలు, పగిలే హృదయం చాలు

కదలాడెనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా
లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా
(కదలాడెనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా)
(లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Ye Kavithalano« gefällt bisher niemandem.