Songtexte.com Drucklogo

Yevaro Raavaali - From “Prem Nagar” Songtext
von P. Susheela

Yevaro Raavaali - From “Prem Nagar” Songtext

అ అ అ అ అ అ అ అ
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి

మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధుర వీణా
మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధుర వీణా మరిచిపొయిన మమత లాగా
మరిచిపొయిన మమత లాగా మమత లుడిగిన మనసులాగా మాసిపో తగునా
ఎవరో రావాలి


ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు
కొనగోట మీటిన చాలు నీలో కోటి స్వరములు పలుకును
ఎవరో రావాలి

రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు
రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు
శక్తి మరచి రక్త విడిచి
శక్తి మరచి రక్త విడిచి మత్తు ఏదొ మరిగినావు మరిచిపోతగునా
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von P. Susheela

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Yevaro Raavaali - From “Prem Nagar”« gefällt bisher niemandem.