Songtexte.com Drucklogo

Nannedo Syeeamaku Songtext
von M.M.Keeravani & Sunitha Upadrashta

Nannedo Syeeamaku Songtext

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్ హా
ఏదేదో సెయ్యమాకు ఏటికాడ ఏయ్ హా
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరో ఓ ఓ ఓ
సాకేదో సెప్పమాకు సందెకాడ ఏయ్ ఓయ్
సొకంతా దాచుకోకు ఆడా ఈడ ఆ ఏయ్
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు
అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు
అలవాటు చేసుకోవమ్మో ఓ ఓ ఓ
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ మ్మ్ హా


కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నను కుడితే
కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నిను కుడితే
మంట నాలో మొదలవుతుంటే
మందు నేనే ఇస్తుంటే
పెదవి ఎంగిలి పై పైన పూస్తే
బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే
ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ హేయ్ హా
నన్నేదో సెయ్యమాకు అందగాడా ఏయ్ హా
అంతకంటే హయి ఉంది వదులుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో ఓ ఓ ఓ

చింతపల్లి సంతకు వెళితే
ఓ చింతపూల చీర కొంటే ఉఁ
చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే ఊఁ
కట్టు నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే
చెంగు బొడ్లో దోపుతువుంటే
చెంగుమని నువ్వు ఉలిక్కి పడగా నాలో ఉడుకే పుడితే
సాకేదో చెప్పమాకు సందెకాడ ఏయ్ హా
షోకంతా దాచుకోకు కోక నీడ ఏయ్ ఏయ్
పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యో ఓ ఓ ఓ
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్ హా ఏయ్ హూఁ

సాహిత్యం: చంద్రబోస్, సింహాద్రి, యమ్యమ్కీరవాణి, సునీత

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Nannedo Syeeamaku« gefällt bisher niemandem.