Songtexte.com Drucklogo

Sooridu Sooridu Songtext
von M.L.R. Karthikeyan

Sooridu Sooridu Songtext

సూరీడు సూరీడు తెరచాటు సూరీడు భరిలోకి దూకాడురా

వేచాడు వేచాడు సమయాన్ని చూసాడు
శివమెత్తి లేచాడురా

ఇన్నాళ్లు ఆచూకీ లేదురా
వేచి ఇకపైన వీడాట చూడరా

వేటాడు సింగమే వీడురా
జూలు విదిలించి లంఘించినాడురా

నిలువెత్తుగా ఆత్మ విశ్వాసమై
ఉడుకెత్తు ఉఛ్వాస నిశ్వాసమై

అదిరించు బెదిరించు రక్కసులనెదిరించు
యముడల్లే కదిలాడురా

పగవాడి కంటిపై కునుకుంచడూ
పదవులకు మధమునకు తలవంచడూ

విశ్వమే ఒకవైపు వీడొక్కడూ
వీడికెదురెళ్ళి మిగలడే ఏ ఒక్కడూ

శత్రువు అది ఎవడైన తృణ పాయమే
ఛత్రపతి సమమైన పెను ధైర్యమే

అణువణువులో సమర చైతన్యమే
వీడి సహనాన్ని కవ్విస్తే భూ ప్రళయమే


ఎలుగెత్తి పిలిచే తొడగొట్టి నిలిచే
వీడి ప్రతి కదలిక పైవాడి ఆదేశమే

సూరీడు సూరీడు తెరచాటు సూరీడు
భరిలోకి దూకాడురా

వేచాడు వేచాడు సమయాన్ని చూసాడు
శివమెత్తి లేచాడురా

ఉప్పొంగి ఎగసింది క్షాత్రవ్యమే
రక్తాన రగిలింది కర్తవ్యమే

దేహాన కణ కణము రన సైన్యమే
అడుగు మోపాడు ప్రతిచోట దిగ్విజయమే

ఒక కంట ఉరుముల్ని నిలిపే గుణం
ఒక కంట పిడుగుల్ని ఆపే బలం

వలపన్ను మెరుపుల్ని విదిలించడం
వీడు పుడుతూనే నేర్చాడు నిజమే నిజం

గురిపెట్టి చూసి సరిపెట్టుకోడూ
చివరంత లక్ష్యాన్ని చేరందె నిదురించడూ

సూరీడు సూరీడు తెరచాటు సూరీడు
భరిలోకి దూకాడురా

వేచాడు వేచాడు సమయాన్ని చూసాడు
శివమెత్తి లేచాడురా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Sooridu Sooridu« gefällt bisher niemandem.