Songtexte.com Drucklogo

Chukklau Themmana Songtext
von Mano & K. S. Chithra

Chukklau Themmana Songtext

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా


షోలే ఉందా, ఇదిగో ఇంద
చాల్లే ఇది జ్వాల కాదా, తెలుగులో తీశారే బాలా
ఖైదీ ఉందా, ఇదిగో ఇంద
ఖైదీకన్నయ్య కాదే, వీడికి అన్నయ్య వాడే
జగదేకవీరుడి కథ, ఇది పాత పిక్చరు కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా

ఒకటా రెండా, పదులా వందా
బాకీ ఎగవేయకుండా, బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా, మతిపోయిందా
చాల్లే మీ కాకిగోల, వేళాపాళంటూ లేదా
ఎమయ్యింది భాగ్యం కథ, కదిలిందాలేదా కథ
వ్రతమేదో చేస్తోందట, అందాక ఆగాలట
లౌఖ్యంగా బ్రతకాలి, సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా, చేస్తానే ఎమైనా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mano & K. S. Chithra

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Chukklau Themmana« gefällt bisher niemandem.