Songtexte.com Drucklogo

Pallavinchu Toli Songtext
von K. S. Chithra

Pallavinchu Toli Songtext

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తతగా సాగు ఈ పాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూట
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగేను నా పయనం

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం


పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కొయిలలెన్నో శ్రోతల వరుసలలో
శీలలైనా చిగురించెను నా పల్లవి పలుకులలో
ఇంద్రధనస్సు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

బ్రతుకే పాటగామారీ బాటయే మార్చగా
వెతికే వెలుగు లోకాలే ఎదురుగా చేరగా
అణువణువూ ఇటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులేన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపననే
పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేళా


పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగా సాగు ఈ పాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూట
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగేను నా పయనం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von K. S. Chithra

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Pallavinchu Toli« gefällt bisher niemandem.