Songtexte.com Drucklogo

Neelimabbu Kondallona Songtext
von K. J. Yesudas & K. S. Chithra

Neelimabbu Kondallona Songtext

నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలివాన సుట్టాలై వచ్చెనంట
ఏ దేవుడు ఈ రాత రాసేనని
ఆకాశ మేఘాలన్నీ అడిగేనంట

నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలివాన సుట్టాలై వచ్చెనంట

పురుడోసినాడే పుట్టింటి పేరు
మెట్టింట దీపమయ్యే ఆడ పుట్టక
సీరె సారెలుగా సిరులన్నీ పోసి
పొరుగోళ్ల పంచనెట్టే సింత సెట్టుగా
విలపించే తలరాతేమో తల్లి కోసమా
తొలిసూరి పిల్లకేమో పేగు దోశమా
మేనమామై పుట్టడమే ఈ మనిషి దోషమా


నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలివాన సుట్టాలై వచ్చెనంట
ఏ దేవుడు ఈ రాత రాసేనని
ఆకాశ మేఘాలన్నీ అడిగేనంట
నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట

మేనాలు మోసే మేనరికపోళ్లే
కాళ్ళు కడిగేసినాక కానోలయ్యేనా
అచ్చంగా బతికే భూదేవికేమో
గుండెల్లో గునపాలయ్యే కాలం వచ్చేనా
సీకట్లో దీపమైన సుట్టమవ్వదా
వాకిట్లో ఏ సెట్టయినా నీడై ఉండదా
ఈ ఉండీలేని సుట్టరికాల గాధలేమిటో

నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలివాన సుట్టాలై వచ్చెనంట
ఏ దేవుడు ఈ రాత రాసేనని
ఆకాశ మేఘాలన్నీ అడిగేనంట

నీలిమబ్బు కొండల్లోన
నీలాల కన్నుల్లోన
ఎర్రపొద్దె గుండె పగిలి ఎడ్సెనంట
తోడునీడ లేని గుండె దీపానికి
గాలివాన సుట్టాలై వచ్చెనంట

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von K. J. Yesudas & K. S. Chithra

Quiz
Wer ist gemeint mit „The King of Pop“?

Fans

»Neelimabbu Kondallona« gefällt bisher niemandem.