Songtexte.com Drucklogo

Laayi Laayi Songtext
von Ilaiyaraaja & Bela Shende

Laayi Laayi Songtext

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా


ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికి ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేమొ కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో
తెలియదు దానికైన ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి
ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా

మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి
మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి
తరగదే ఈ సందడి
చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా
గులాబి లాంటి గుండె పూసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి
ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా


లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ilaiyaraaja & Bela Shende

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Laayi Laayi« gefällt bisher niemandem.