Songtexte.com Drucklogo

Kalalu Kaavule Songtext
von Hemachandra Vedala & Malavika

Kalalu Kaavule Songtext

కలలు కావులే కలయికలిక
కరిగిపోవు ఈ కదలికలిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట


ఓ సఖి నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే
ఒంటరి ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నా దాన


మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాలా
అందుతూ చేజారిన చేమంతి మాల
అందని దూరాలకే నువు పోనేలా
తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీతో ఏకం అవుతా ఏమైనా
కలలు కావులే కలయికలిక
కరిగిపోవు ఈ కదలికలిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Kalalu Kaavule« gefällt bisher niemandem.