Songtexte.com Drucklogo

Neelo Jarige (From “Balu”) Songtext
von Hariharan

Neelo Jarige (From “Balu”) Songtext

నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా? చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా?
పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా?
వలపంటే నిప్పులాంటిది, కలకాలం దాచలేనిది, సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది, ఐనా మరి ముందు నీకే తెలిసేనా

ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు
ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు
వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు
ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా
దీన్నే love లో పడిపోటం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు

అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు
ఐతేమరి నువ్వెపుడూ కనలేదా ఈ కలలు
నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు
అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా
దీన్నే love లో పడిపోటం అంటున్నా
హ్మ... అవునా ఏమో నే కాదనలేకున్నా

నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో
అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా?
పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా?
వలపంటే నిప్పులాంటిది, కలకాలం దాచలేనిది, సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది, ఐనా మరి ముందు నీకే తెలిసేనా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Neelo Jarige (From “Balu”)« gefällt bisher niemandem.