Songtexte.com Drucklogo

Attarintiki (From “Okkadu”) Songtext
von Hariharan

Attarintiki (From “Okkadu”) Songtext

ముత్తైదులంతా ముదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే

మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసింది జోడి
హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీకోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా

ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకి
సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే

వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్ళో
నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఓళ్ళో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ
హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా

ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వేయ్యాలి
ముచ్చట తీరేలా అంతా రండీ

ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకోని
హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Attarintiki (From “Okkadu”)« gefällt bisher niemandem.