Songtexte.com Drucklogo

Nuvvante Na Navvu Songtext
von Haricharan & Sinduri Vishal

Nuvvante Na Navvu Songtext

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటూ నేనంటూ లేమని
అవునంటు మాటివ్వు నిజమంటూనే నువ్వు నే రాని దూరాల్ని నువ్ పోనని
ఎటువున్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్న నీవైపే చేరేనులే
నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం
నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే
పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేన కలిసే ఉన్నా
మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువవుదాం అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా


నువ్ నవ్వేటి కోపానివే మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే
నచ్చే దారులలో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోన
విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే
వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Nuvvante Na Navvu« gefällt bisher niemandem.