Gundelothulalo Songtext
von Dhee
Gundelothulalo Songtext
గుండెలోతులలో గుండుసూది గుచ్చకు
కలల గొంతు నులిమి మన్నులోన పూడ్చకు
శూలాల మాటల్తో బాధించకు
కనుపాపల్లో శూన్యంగా వేధించకు
మంటల్లో ప్రాణాన్ని మండించకు
కనరానంటూ కన్నీట నను ముంచకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నాకందించవా
నా కలల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరలా కూర్చవా
చిగురు వేళ్ళకు పొగరు నేర్పిన గురువు నువ్వే లేవని
బరువు గుండెల సెగలు రేగిన బాధ తీర్చేదెవరని
నాకు నేనే తోడనీ, నను నే ఓదార్చనీ
గాలుల్తో నా మనసు మూసెయ్యకు
కసిరే కన్నై నా పిలుపు ఆపెయ్యకు
నన్నే నే విననంటూ నీ వైపుకు
అడుగేస్తున్నా నా ప్రేమను విసిరేయకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నాకందించవా
నా కలల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరలా కూర్చవా
కలల గొంతు నులిమి మన్నులోన పూడ్చకు
శూలాల మాటల్తో బాధించకు
కనుపాపల్లో శూన్యంగా వేధించకు
మంటల్లో ప్రాణాన్ని మండించకు
కనరానంటూ కన్నీట నను ముంచకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నాకందించవా
నా కలల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరలా కూర్చవా
చిగురు వేళ్ళకు పొగరు నేర్పిన గురువు నువ్వే లేవని
బరువు గుండెల సెగలు రేగిన బాధ తీర్చేదెవరని
నాకు నేనే తోడనీ, నను నే ఓదార్చనీ
గాలుల్తో నా మనసు మూసెయ్యకు
కసిరే కన్నై నా పిలుపు ఆపెయ్యకు
నన్నే నే విననంటూ నీ వైపుకు
అడుగేస్తున్నా నా ప్రేమను విసిరేయకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నాకందించవా
నా కలల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరలా కూర్చవా
Writer(s): Santhosh Narayanan, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com