Songtexte.com Drucklogo

Rangeli Holi Songtext
von Shankar Mahadevan

Rangeli Holi Songtext

కృష్ణ కృష్ణ కృష్ణా
హే రామ రామ రామా

(చిన్నా పెద్దా అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్
పండుగ చేయ్యలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్
తీపి చేదు అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్
పంచి పెట్టాలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్)

రంగేళి హోలీ హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా
జీం తరత్తా తకథిమి, జీం తరత్తా
జీం తరత్తా తకథిమి, జీం తరత్తా


హేయ్ రంగేళి హోలీ
(హోలీ)
హంగామా కేళి
(కేళి)
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి

తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే
ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదమవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగజేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా

రంగేళి హోలీ
హంగామా కేళి


కన్నుల జోలపదాలై కొల్లల జానపదాలై
నరుడికి గీత పదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది
మనలో మనమే కలహించి మనలో మనిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

(గొబ్బియలో గొబ్బియలో
గొబ్బియలో గొబ్బియలో)

ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Rangeli Holi« gefällt bisher niemandem.