Songtexte.com Drucklogo

Cheppave Chiru Gali Songtext
von Mani Sharma

Cheppave Chiru Gali Songtext

చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ... చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూసే కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది


చుట్టూ ఇంకా రేయున్నా
అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా చీకట్లు
కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి
(కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి)
చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కథ వినిపించేలా
రాధా మాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ
చెవిలో సన్నాయి రాగంలా

కలలే నిజమై అందేలా
ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఎటని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో చూపదా వసంతాల కేళి
(ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో చూపదా వసంతాల కేళి)
చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mani Sharma

Fans

»Cheppave Chiru Gali« gefällt bisher niemandem.